Bandi Sanjay: సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో ఇప్పటికీ తెలియదు

కేబినెట్ లో 317జీవో పై చర్చ జరపకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.

Bandi Sanjay: సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో ఇప్పటికీ తెలియదు

Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు పెంచారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్, జీవో 317, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అంశాలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వందశాతం వ్యాక్సిన్ వేయడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది అంటే అందుకు కేంద్ర ప్రభుత్వం సహకరమే కారణం అని బండి సంజయ్ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్ పెడితే.. కొంతమంది మేధావి వర్గం.. కేంద్రంపై విమర్శలు చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయిందని, ఈ విషయాన్ని ప్రపంచం ప్రస్తావిస్తోందని ఆయన చెప్పారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ దొరక్క దేశమంతా ఇబ్బంది పడిందన్న బండి సంజయ్.. మోదీ పాలన వల్ల ఇప్పుడా సమస్య లేదన్నారు. కరోనా సమయంలో మోదీకి సహకరించిన తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు చేశారు. దేశమంతా ఒకవైపు ఉంటే కేసీఆర్ ఒకవైపు ఉంటారని అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా? అనేది తెలియదన్నారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అని ముఖ్యమంత్రి చెప్పరా? బండి సంజయ్ అడిగారు.

9 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో 317జీవోపై ఎందుకు చర్చ జరపలేదని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు. కేబినెట్ లో 317జీవో పై చర్చ జరపకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. 317 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలన్నారు.

ఉద్యోగులకు అండగా బీజేపీ ఉందని, తాము మరోసారి జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ సంఘాలతో త్వరలోనే వర్చువల్ సమావేశాలు జరుపుతామని తెలిపారు. కేసీఆర్ ఎన్ని కమిటీలు వేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్.. గతంలో వేసిన కమిటీ నివేదికలు ఎక్కడికి వెళ్లాయని అడిగారు. కాలయాపన చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్.. కమిటీలు వేస్తారని మండిపడ్డారు.

Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మేము వ్యతిరేకం కాదన్న బండి సంజయ్.. ఉద్యోగులు లేకుండా ఎన్ని మీడియంలు పెడితే ఏం లాభం అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి నిధులు, కమిషన్లు తీసుకోవడానికే ఇంగ్లీష్ మీడియం అనే కొత్త డ్రామాకు ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారైనా పాఠశాలల సందర్శన చేశారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ ఎందుకు పాల్గొన లేదో కారణం చెప్పాలన్నారు. వరంగల్ పర్యటన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రద్దు చేసుకున్నారో తెలపాలన్నారు. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని, కేసీఆర్ జాతకం ఇప్పుడు సరిగ్గా లేదని బండి సంజయ్ అన్నారు.