Telangana BJP : బండి సంజయ్ పాదయాత్ర..ముహూర్తం ఖరారు

2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.

Telangana BJP : బండి సంజయ్ పాదయాత్ర..ముహూర్తం ఖరారు

Telangana Bjp

Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీన్ నెలకొంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు పాదయాత్రలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హుజూరాబాద్ లో బీజేపీ నేత ఈటల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక జరుగనుంది. ఇదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి..ప్రజల వద్దకు వెళ్లేవిధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

Read More : Funny video : ఫుట్‌బాల్‌ గ్రౌండులో అమ్మను పరుగులు పెట్టించిన బుడ్డోడు..

పాదయాత్ర రెండున్నరేళ్లు ఉండే విధంగా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు సమాచారం. తాజాగా..ఆయన పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రకటించారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ఈ పాదయాత్ర జరుగుతుందని వెల్లడించారు.

ప్రతొక్క బూత్ నుంచి కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుందని రాజా సింగ్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర స్టార్ట్ అవుతుందని రాజాసింగ్ తెలిపారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

Read More : Naga Panchami : కాల సర్ప దోషాలు తొలగిపోవాలంటే నాగపంచమి రోజున ఏంచేయాలి…

నాలుగైదు విడతల రూపంలో పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. మొదటి విడత పాదయాత్ర పాతబస్తీ, ఆర్యమైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, సదాశివపేట, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బెజ్జంకి, హుస్నాబాద్ మీదుగా హుజురాబాద్ వరకు కొనసాగుతుందని సమాచారం. ఇక్కడే మొదటి విడత పాదయాత్ర పూర్తవుతుందని తెలుస్తోంది. మొదటి విడతలో మొత్తం 55 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుందని సమాచారం. బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, రోడ్ మ్యాప్ త్వరలోనే తెలియనుంది.