CM KCR : ధాన్యం కొంటారా లేదా? ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..

CM KCR : ధాన్యం కొంటారా లేదా? ఢిల్లీకి సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీ టూర్ లో రాష్ట్ర సమస్యలను కేంద్ర పెద్దల ముందు విన్నవిస్తారు. కేంద్ర మంత్రులను కలిసి ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించనున్నారు. అవసరమైతే ప్రధాని మోదీని కలుస్తానని కేసీఆర్ ఇప్పటికే చెప్పారు.

Instant Covid Test : కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!

అలాగే నీటి పంపకాలు, కులగణన, విద్యుత్ చట్టాల రద్దుపై విజ్ఞప్తి చేస్తామని సీఎం చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు కేసీఆర్. అనేక సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రాజకీయ విమర్శలు వస్తున్నాయి.

Yawns : ఆవలింతలు అదే పనిగా వస్తున్నాయా…ఆలోచించాల్సిందే?…

ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఇదివరకే డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసి దీనిపై విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే యాసంగిలో ఎంతమేరకు పంట కొనుగోలు చేస్తారనే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కూడా కేసీఆర్ డిమాండ్ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తారో లేదో తేల్చాలని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ మరోసారి కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.