Telangana EAMCET : తెలంగాణ ఎంసెట్ తేదీలివే

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేస్తోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు.

Telangana EAMCET : తెలంగాణ ఎంసెట్ తేదీలివే

Ts Eamcet

Telangana EAMCET : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేస్తోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఇతర సెట్ లకు సంబంధించి పరీక్షల తేదీలను ఖరారు చేశారు అధికారులు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు గత సంవత్సరం నుంచి మూతపడ్డాయి. వైరస్ విజృంభిస్తుండడంతో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. వైరస్ కు చెక్ పెట్టడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంది.

నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కఠిన నిబంధనలు అమలు చేసింది. దీంతో వైరస్ కంట్రోల్ కి వచ్చింది. దీంతో అమలు చేసిన లాక్ డౌన్ ను ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. స్కూళ్లు కూడా జూలై 01వ తేదీ నుంచి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంసెట్ ఇతర పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నత విద్యా మండలి.

ఆగ‌స్టు 3న ఈసెట్‌, ఆగ‌స్టు 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పీజీ ఈసెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల‌కు ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జులై 05వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 03వ తేదీ వరకు దరఖాస్తుల గడువు ఇచ్చారు. ఈ గడువును తర్వాత పెంచారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరించ‌నున్నారు.