TS Lockdown Count Down : కొన్నిగంటల్లో తెలంగాణలో లాక్‌డౌన్.. కౌంట్‌డౌన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కౌంట్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్‌ వేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

TS Lockdown Count Down : కొన్నిగంటల్లో తెలంగాణలో లాక్‌డౌన్.. కౌంట్‌డౌన్

Telangana Lockdown Countdown In Statewide

Telangana Lockdown Countdown : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కౌంట్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్‌ వేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించింది. 10 గంటల వరకు ప్రజారవాణా సైతం యథావిధిగా కొనసాగనుంది. అటు వైన్స్‌ కూడా 4 గంటల పాటు తెరవడానికి పర్మిషన్ ఇచ్చింది. 10 గంటల తర్వాత.. మినహాయింపు ఇచ్చిన రంగాలు తప్ప.. అన్నీ మూతపడాలంటూ తెలంగాణ సర్కార్ ఆదేశాలిచ్చింది.

ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనుంది ప్రభుత్వం. లాక్‌డౌన్‌ ధాన్యం కొనుగోళ్లకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు నడనున్నాయి. ఏటీఎంలు, బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి. జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా కొనసాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయి. ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిచ్చింది సర్కార్‌. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలని నిబంధన విధించారు. ఇక గ్యాస్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. సినిమాహాళ్లు, క్లబ్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ కు అనుమతిలేదు.

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నా.. అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న బాధితులు, వైద్యరంగంలో పనిచేసే వారి వాహనాలకు అనుమతి ఉంటుంది. నిత్యావసర వస్తువుల పాలు, కూరగాయలు, ఆహార సామగ్రి, డెయిరీ ప్రొడక్ట్స్‌ రవాణాకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. వైద్య రంగంలో ఫార్మాసూటికల్‌ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్‌ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు ఎప్పట్లానే కొనసాగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వాటి సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వారి వాహనాలకు అనుమతించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ పనులు, రైస్‌ మిల్లుల నిర్వహణ, ఫెర్టిలైజర్, సీడ్‌ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కార్. విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు పనిచేస్తాయి.

జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్‌ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్‌ స్టోరేజీ, వేర్‌ హౌసింగ్‌ కార్యకలాపాలు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ఉపాధిహామీ పనులపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పింది ప్రభుత్వం. ఐటీ, నాన్‌ ఐటీ, టెలికామ్‌, పోస్టల్, ఇంటర్నెట్‌ సర్వీసెస్‌కు అనుమతి ఉంటుంది. అయితే ప్రైవేట్‌ రంగాల్లో పనిచేసే వారికి వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించడం మంచిదని ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల్లో.. సినిమా హాళ్లు, క్లబ్బులకు ఎలాంటి మినహాయింపు లేదని ప్రభుత్వం స్పస్టం చేసింది. జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, క్రీడా మైదానాలు మూసేయాలని ఆదేశించింది. అన్ని మతపరమైన ప్రార్థనా కేంద్రాలు, మందిరాలు, మత పరమైన కార్యక్రమాల జన సమూహాలపై నిషేధం కొనసాగనుంది. అంతరాష్ట్ర బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను అనుమతించమని సర్కార్‌ తేల్చిచెప్పింది.