Telangana : దొడ్డి దారిన సీఎం అయిన మీకేం తెలుసు కేసీఆర్ గురించి-ధ్వజమెత్తిన తెలంగాణ మంత్రులు

తెలంగాణ  సీఎం కేసీఆర్ కు దమ్ముందో లేదో ప్రధాని నరేంద్ర మోడీని అడిగితే చెపుతారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహా

Telangana : దొడ్డి దారిన సీఎం అయిన మీకేం తెలుసు కేసీఆర్ గురించి-ధ్వజమెత్తిన తెలంగాణ మంత్రులు

CM kcr And Shivaraj Singh Chouhan

Telangana :  తెలంగాణ  సీఎం కేసీఆర్ కు దమ్ముందో లేదో ప్రధాని నరేంద్ర మోడీని అడిగితే చెపుతారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కౌంటరిచ్చారు. శివరాజ్ సింగ్  నిన్న హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపధ్యంలో తెలంగాణ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్‌కు గట్టిగా సమాధానం చెప్పారు.

దొడ్డి దారిన సీఎం ఆయిన శివరాజ్ సింగ్ కు కేసిఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని తలసాని అన్నారు. కేంద్రం ఏమి ఇచిందో చెప్పె దమ్ము బీజేపీనేతలకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి టూరిస్ట్ ల్లా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిపై తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించటానికి ఎక్కడైనా మేము రెడీ….. ఢిల్లీలో బహిరంగ చర్చకు బీజేపీ నేతలు సిద్దమా అని తలసాని సవాల్ విసిరారు. దేవుళ్ళ పై చర్చకు రెడీ…ఏ దేవాలయం‌కు వస్తామంటే…అక్కడికి మేము వస్తాం అని ఆయన సవాల్ విసిరారు.

బీజేపీ నేతలు బాధ్యత లేకుండా రెచ్చగొడుతున్నారని…ఎన్నికల కోసం ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. రైతులు అడ్డుకుంటే ఇదో డ్రామా….మా ఉద్యోగుల కోసం మీరు డ్రామాలు చేయడం ఎందుకు… కేంద్రం నుంచి టూరిస్టులు గా కాకుండా జాతీయ ప్రాజెక్టు తో రండిని తలసాని బీజేపీ అధిష్టానాన్ని కోరారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చిన రోజు ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని పెద్ద డ్రామా
ఆడారని తలసాని అన్నారు.

ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి పై ఇష్టానుసారంగా మాట్లాడ్డం మంచిది కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవ్వారు.మాది రహదారి….మీది అడ్డ దారని…ఇప్పుడు మీరు సీఎం ఎలా అయ్యారో అందరికి తెలుసని ఆయనవ్యాఖ్యానించారు. నాలుగు సార్లు సీఎం అయిన శివరాజ్ సింగ్ ఏం చేశారో చెబితే బాగుండేదని…ఇంకొ పది సార్లు సీఎం అయినా తెలంగాణాలో చేపట్టిన పనులు మీరు చేయలేరని శ్రీనివాస గౌడ్ అన్నారు. 317 జీవోతో రాజకీయం చేయాలని బీజేపీ నేతలు యత్నం చేస్తున్నారని…తెలంగాణ ఉద్యోగులకు ఇస్తున్న జీత,భత్యాలు మీరాష్ట్రాల్లో ఇచ్చి తెలంగాణ కు రండి అని శివరాజ్ సింగ్ కు మంత్రి సవాల్ విసిరారు. మీ రాష్ట్రాలకు వచ్చి మేము చేసే సంక్షేమ పధకాలను వివరిస్తామని మీ పాలనపై నమ్మకముంటే మమ్మల్ని ఆహ్వానించమని శ్రీనివాస గౌడ్ కోరారు.

Also Read :Punjab CM: పంజాబ్ సీఎం చన్నీ కుటుంబానికి కొవిడ్ పాజిటివ్

మధ్యప్రదేశ్ అనారోగ్య రాష్ట్రం అని నీతి ఆయోగ్ ప్రకటించిందని…ఓ బీసీగా నాలుగు దఫాలు సీఎం గా ఉండి బీసీ లకు ఏమి చేశారో చెప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. మా ముఖ్యమంత్రి ఒక్క పిలుపునిస్తే… భయం అంటే ఏమిటో మేము చూపించేవాళ్లమని ఆయన అన్నారు. మేము మర్యాద తో ఉన్నందుకే మీరు క్షేమంగా వెళ్లారని గంగుల వ్యాఖ్యానించారు.