Sharmila : తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా జులై 8న కొత్త పార్టీ : YS షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టటానికి వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో జులై 8న కొత్త పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పెడతున్నామని ప్రకటించారు. పార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతుండటంతో వైయస్ షర్మిల హైదరాబాద్ లోని లోటస్‌ పాండ్‌ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశమయ్యారు.

Sharmila : తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా జులై 8న కొత్త పార్టీ : YS షర్మిల

West Bengal Lightning Strikes

YS Sharmila new party : తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టటానికి వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో జులై 8న కొత్త పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పెడతున్నామని ప్రకటించారు. పార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతుండటంతో వైయస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశమయ్యారు. అనంతరం జులై 8న పార్టీ పెడుతున్నామని ప్రకటించారు.

జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల ఈ సన్నాహాక సమావేశంలో చర్చిస్తారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళే ప్రకటించనున్నారు. కాగా..షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా నిన్ననే ఆపార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పేరును లాంఛనంగా ప్రకటించనున్నారు. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యిందని పార్టీ సమన్వయకర్త రాజగోపాల్ వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ షర్మిల తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అంటే జులై 8న వైఎస్​ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యాయి. పార్టీ కార్యక్రమాలను కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు.

పార్టీ ప్రకటన విషయమైన వైఎస్ షర్మిల మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పార్టీ విధానం ఉంటుందని తెలిపారు. మా పార్టీకి ప్రజలందరి భాగస్వామం చాలా అవసరమని మీ రాజన్న బిడ్డగా నన్ను ఆశీర్వదించి సహకరించాలని షర్మిల కోరారు. మన పార్టీలో ప్రజల సమస్యలు తెలుసుకునేవారు మాత్రమే పార్టీ నాయకులుగా ఉంటారని స్పష్టంచేశారు. కాగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ షర్మిల వాడి వేడి మాటలు ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో ఇటీవల కాలంలో పలు విమర్శలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు వంటి పలు అంశాలపై అధికారపార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఈక్రమంలో వైఎస్ షర్మిల. ‘వైయస్ఆర్ తెలంగాణ పార్టీ’కి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను ఇప్పటికే నియమించారు. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడ్ హక్ కమిటీలు కూడా ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల. మరి షర్మిల ఆశించినట్లుగా తెలంగాణలో పార్టీ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటుందే లేదో వేచి చూడాలి.