Telangana Congress : పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ ఫిర్యాదు..

కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీపీసీసీ.

Telangana Congress : పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ ఫిర్యాదు..

tpcc decided to complaint against 12 mlas who joins TRS (BRS)from congress

Telangana Congress: కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీపీసీసీ. దీని కోసం కాసేపట్లో సీఎల్పీ భేటీకానుంది. సీఎల్పీ సమావేశం తరువాత నేతలంతా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన వెనుకున్న రాజకీయంగా, ఆర్థికంగా పొందిన లాభాలను ఫిర్యాదులో పొందుపరచనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఎర కేసుపై సిట్, సీబీఐ,హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఇది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై ప్రయోగించిన అస్త్రంగా కనిపిస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రం చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో.. ఇప్పుడు అచ్చం అలాగే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని.. కేసీఆర్‌ను టార్గెట్ చేయబోతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

పదవులు, డబ్బులను ఆశజూపి.. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయటానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. అనంతరం ఇతర నేతలతో కలిసి మొయినా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. వారితో పాటు టీఆర్ఎస్‌పైనా ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ పార్టీన తర్వాత ఆ ఎమ్మెల్యేలకు ఆర్థికపరంగా, రాజకీయపరంగా ప్రయోజనాలు చేకూరాయని ఫిర్యాదులో పేర్కొననుంది.

కాంగ్రెస్ లో ఉన్న 18 ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది హస్తం పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిలో… నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (ఆర్థిక లబ్ది కోసమే లింగయ్య పార్టీ మారినట్లుగా ఆరోపణ)పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు (అసెంబ్లీలో విప్ పదవి),ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ (ఆర్థిక లబ్ది కోసం), మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (మంత్రి పదవి),పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి (ఆర్థిక లబ్ది,కాంట్రాక్టు బిల్లుల కోసం),ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి (మూసీ నది అభివద్ధి చైర్మన్ పదవి),కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(ఆర్థిక లబ్ది, భూ వివాదాల పరిష్కారం కోసం),కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి(ఆర్థిక లబ్ది, భూసుకరణ డబ్బుల కోసం),ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ (ఆర్థిక లబ్ది కోసం),భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (ఆర్థిక లబ్ది, భార్యకు జడ్పీ చైర్మన్ పదవి),తాండుర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(ఆర్థిక లబ్ద కోసం), ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(ఆర్థిక లబ్ది కోసం), భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇప్పుడు వీరందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతోంది టీపీసీసీ.