TSPSC Paper Leak Case : సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లపై నిషేధం.. TSPSC సమావేశంలో కీలక నిర్ణయాలు
ఇకపై టీఎస్ పీఎస్ సీ కార్యాలయంలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు తీసుకెళ్లటంపై నిషేధం విధించారు. సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ ల నిషేధంపై ఉద్యోగులకు.. కమిషన్ కీలక సూచనలు చేసింది.(TSPSC Paper Leak Case)

TSPSC Paper Leak Case : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్ సీ)లో ఇకపై లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్ సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై టీఎస్ పీఎస్ సీ కార్యాలయంలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు తీసుకెళ్లటంపై నిషేధం విధించారు. సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ ల నిషేధంపై ఉద్యోగులకు.. కమిషన్ కీలక సూచనలు చేసింది. సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేసి విధులకు వెళ్లాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
టీఎస్ పీఎస్ సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్వశ్చన్ పేపర్ల లీకేజీపై సిట్ ఇచ్చిన నివేదికపైనా చర్చ జరిగింది. వచ్చే నెలలో జరిగే పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం ఆన్ లైన్ వ్యవస్థను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీలో నిందితులను సిట్ విచారించింది. ప్రవీణ్, రాజశేఖర్, డాక్య, రాజేశ్వర్ లపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు.(TSPSC Paper Leak Case)
ఇప్పటివరకు గ్రూప్ 1 పరీక్ష రాసిన 40 మందిని విచారించిన సిట్.. వీరికి పరీక్ష రాసే సామర్థ్యం ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు అధికారులు. 40మందికీ లీకేజీతో సంబంధం లేదని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో నిందితులు డాక్య నాయక్, తిరుపతయ్యలను గ్రామాలకు తీసుకెళ్లారు సిట్ అధికారులు.(TSPSC Paper Leak Case)
ఇక, మొదటిసారి కస్టడీలో ప్రవీణ్ నోరు మెదపలేదు. రెండోసారి కస్టడీలో తమదైన శైలిలో ప్రశ్నించారు సిట్ అధికారులు. అటు ప్రవీణ్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. న్యూజిలాండ్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. తిరుపతయ్యను హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు, అతడి నుంచి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా సల్కర్ పేటకు చెందిన తిరుపతయ్య.. ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్నాడు. రేణుక, డాక్య నాయక్ లకు తిరుపతయ్య సన్నిహితుడు. కస్టడీలో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్య, రాజేశ్వర్ లతో కలిపి తిరుపతయ్యను విచారించారు సిట్ అధికారులు. డాక్యతో పరిచయాలపై ఆరా తీశారు.(TSPSC Paper Leak Case)