Group-1 Prelims Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ పరీక్షకు 25,050 మంది అభ్యర్థులు ఎంపిక

తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.

Group-1 Prelims Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ పరీక్షకు 25,050 మంది అభ్యర్థులు ఎంపిక

TSPSC

Group-1 Prelims Results : తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఒక రోజు ముందే సంక్రాంతి పండుగ వచ్చనట్లైంది. ఓ అభ్యర్థి వివాదం నేపథ్యంలో నిలిచిపోయిన గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సదరు అభ్యర్థి విజ్ఞప్తి మేరకు ఫలితాలను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఆ అభ్యర్థి స్థానికత అంశంపై తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.

దీంతో గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచారు. జూన్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్ పీఎస్సీ అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది.  ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Group-1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి

టీఎస్ పీఎస్సీ అక్టోబర్ 29వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించారు. అనంతరం నవంబర్ 15న మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించి, ఫలితాలను విడుదల చేసింది.