Vaccination For All : 18ఏళ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో

Vaccination For All : 18ఏళ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Vaccination For All

Vaccination For All : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో గురువారం(జూలై 1,2021) నుంచి వ్యాక్సిన్లు ఇవ్వ‌నున్నారు. ప్రస్తుతం 30ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇవ్వనుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా నేరుగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చు. వ్యాక్సినేష‌న్ పొందేందుకు అర్బ‌న్ లోక‌ల్ బాడీస్‌, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోవైపు హై రిస్క్ ఉన్న గ్రూప్‌ల‌కు టీకాలు వేసే కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది.

రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 1.5 కోట్లకు పైగా వ్యక్తులకు కొవిడ్ వ్యాక్సిన్లను అందించే కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ ప‌రిధిలో 100 జీసీవీసీల‌ను, అర్బ‌న్ లోక‌ల్ బాడీల్లో 204 జీసీవీసీల‌ను, గ్రామీణ ప్రాంతాల్లోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హత ఉన్నవారికి టీకాలు వేసే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. లబ్ధిదారులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్ర‌జారోగ్య డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ విజ్ఞప్తి చేశారు. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న వారికి 14-16 వారాల మధ్య రెండో డోసు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,006 మంది కోలుకున్నారు. మరో 10 మంది కరోనాతో చనిపోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసులు 6,23,510కి పెరిగాయి. 6,06,461 మంది కోలుకున్నారు. 13వేల 388 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3వేల 661కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,09,802 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.