Sharmila : రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు..కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు..

రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది...కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని..రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటంలోను..పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

Sharmila : రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు..కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు..

Ys Sharmila

T.Farmers Problems..Sharmila Comments : రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది…కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని..రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటంలోను..పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల వచ్చీ రావటంతోనే దూకుడు పెంచారు. జులై8న పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పిన షర్మిల ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తునూ మరోవైపు తెలంగాణలో పర్యటిస్తున్నారు. రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా దోమ మండలంపాలేపల్లి రైతును పరామర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.పంట గిట్టుబాటు ధర వంటి అంశాలపై మాట్లాడారు.

అనంతం షర్మిల మాట్లాడుతూ..రైతులు పండించిన ధాన్యాన్ని కొనటంలోను కరోనాను కట్టడి చేయటంతోను సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శలు సంధించారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ రైతులు వ్యతిరేకి అనీ రైతు ద్రోహి అంటూ విమర్శలు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం కనీసం వడ్డీలు కూడా మాఫీ చేయాలేదని..ప్రభుత్వం రైతుబంధు అంటూ ఇస్తున్న డబ్బులు రూ.5వేలు రైతులకు దేనికి సరిపోతాయి? అని ప్రశ్నించారు.

రైతుబంధు పథకం అనేది రైతుకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి ఇచ్చే పరిహారమా? అని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. రైతు పండించి ప్రతీ గింజను కొనాలని..మొలకెత్తిన ప్రతీ గింజా కొనాలని ఈ సందర్భంగా షర్మిల సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతు అమ్ముకునే పంటను కూడా దళారులు దోచుకుంటున్నారనీ..కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది? కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని కనీసం అరికట్టటానికి కూడా యత్నించటలేదని ఆరోపించారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందనీ..రైతన్నలకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుతామని షర్మిల వ్యాఖ్యానించారు.