Amla Farming : ఉసిరి సాగులో మెళకువలు..సూచనలు
నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.

Amla Farming
Amla Farming : ఉసిరి పంట సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉసిరి సాగును రైతులు చేస్తున్నారు. ఉద్యానవనశాఖ ఉసిరి సాగువైపు రైతులను ప్రోత్సహిస్తుంది.
READ ALSO : Organic Farming : రైతు ఇంట ప్రకృతి పంట.. విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం
నేలలు ;
నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.
అనువైన రకాలు ;
ప్రస్తుతం అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చకియా రకం, బెనారసి రకం, ఫ్రాన్సిస్ రకం, భవాని సాగర్ రకం , కాంచన్, కృష్ణ, ఆన్నంద్1,2రకం, యన్.ఎ7 రకాలను రైతులు సాగు చేస్తున్నారు.
READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు
ఎకరాకు కావాల్సిన మొక్కలు ;
ఎకరా పొలంలో 160 మొక్కలు అవసరమౌతాయి. చెట్టుకి చెట్టుకి మధ్య 15 అడుగుల దూరం, వరుసల మద్య 15 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి.
ఎరువులు ;
మొక్కలు నాటే ముందుగా 60 సెంటిమీటర్లు వెడల్పు, 60 సెంటి మీటర్ల పొడవు , 60 సెంటమిటర్ల లోతు గుంతలు తొవ్వి బాగా చివికిన (ఎరువుని 200 గ్రాముల సూపర్ ఫాస్పేట్, 50 గ్రాముల ఎండోసల్పాన్ పొడి కలిపి గుంతలలో ఉసిరి మొక్కలని నాటుకోవాలి. మొక్కలు నాటిన తరువాత అవసరాన్నిబట్టి సేంద్రియ ఎరువులు వాడాలి. మొక్కలు పెరుగుతున్న కొద్దీ ఎరువుల అవసరం కూడా పెరుగుతుంది, 7 నుండి 10 సంవత్సరం వయసు గల మొక్కలకి 1. 5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం , మరియు 0. 75 కిలోల ఫొటాష్ ఎరువులని వేసుకోవాలి.
READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..
నీటి యాజమాన్యం ;
ఉసిరి చెట్టు నీటి ఎద్దడి తట్టుకుంటుంది. అయితే నీటియాజమాన్యం సవ్యంగా పాటిస్తే మొక్కలలో ఎదుగుదల బాగుంటుంది. తద్వారా దిగుబడులు సాధించవచ్చు. మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్నిబట్టి నీరు అందిస్తే మొక్కలు బాగా పెరుగుతా యి. ఎండాకాలంలో మాత్రం 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. డ్రిప్ పద్ధతిని పాటిస్తే నీటిని ఆదా చేసుకోవచ్చు.