చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం…ముగ్గురు మృతి…20 మందికి గాయాలు

3 dead, 20 injured in bus accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బండకిందిపల్లికి వెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ముగ్గురు మరణించారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.
మదనపల్లి-పుంగనూరు రోడ్డులోని నవోదయ స్కూల్ సమీపంలోని జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రోడ్డు మలుపు వద్ద అతివేగంగా బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని సోమశేఖర్, మల్లికార్జున, గంగుల్లప్పగా గుర్తించారు.