Road Accident: రెంటచింతల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Road Accident: రెంటచింతల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

Accident

Updated On : May 30, 2022 / 9:48 AM IST

Road Accident: పల్నాడు జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకుంటామని భావించిన ప్రయాణికులకు ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..శ్రీశైలం నుంచి ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహానం.. రెంటచింతల కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొట్టింది. ఈఘటనలో 9 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా..మరో 29 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో టాటా ఏస్ వాహనంలో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అసలే కిక్కిరిసి ఉన్న వాహనంలో ప్రమాద ధాటికి ప్రయాణికులు ఒకరిపైఒకరు పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.

other stories: Washington‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో..

ప్రమాదం పై సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు..క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ప్రమాదం పై సమాచారం అందుకున్న మాచర్ల ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డి..ఆసుపత్రి వద్దకు చేరుకొని ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే పిఆర్కే..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని..ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలను ఆదుకునేలా చేస్తానని ఎమ్మెల్యే పిఆర్కే పేర్కొన్నారు. రెంటచింతల రోడ్డు ప్రమాదం పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని..మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

other stories: Kerala : స్టేజిపై పాట పాడుతూ కుప్పకూలిపోయి మరణించిన సింగర్