Visakhapatnam : భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది

రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంకు చెందిన నాగరాజు, సాయికి ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి భాను, పృథ్వీరాజ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Visakhapatnam : భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది

Visakha

Updated On : February 14, 2022 / 12:58 PM IST

children killed : విశాఖపట్నం జిల్లాలోని విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఇద్దరు చిన్నారుల మృతికి దారి తీసింది. ఇద్దరు పిల్లలు సహా తల్లి బావిలో దూకింది. చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంకు చెందిన నాగరాజు, సాయికి ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి భాను, పృథ్వీరాజ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే నాగరాజు మద్యానికి బానిసై, ఇంట్లో డబ్బులు ఇవ్వవడం లేదు. ఈ నేపథ్యంలో నిత్యం కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే భార్యాభర్తలు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో
వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకొని సాయి హడావిడిగా బయటికి వెళ్లింది.

Central Government : మరో 54 చైనా యాప్స్‌ను నిషేధించిన కేంద్రం

తిరిగి వస్తుందనుకున్న నాగరాజు.. భార్య, పిల్లలను పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి.. ఇద్దరు పిల్లలను తీసుకుని సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో తోసేసి, తర్వాత తాను కూడా దూకేసింది. చిన్నారులిద్దరూ మృతి చెందారు. బావిలో దూకిన తర్వాత భయపడ్డ సాయి.. మెట్లు పట్టుకుని వేలాడుతూ కేకలు వేసింది. ఉదయం అటుగా వెళ్తోన్న స్థానికులు శబ్ధం విని బావి దగ్గరకు వెళ్లారు.

దీన్ని గమనించిన స్థానికులు చనిపోయిన పిల్లలతోపాటు తల్లిని కూడా బయటికి తీశారు. మహిళను ప్రాణాలతో కాపాడగలిగారు. కాగా, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.