Chandrababu Interrogation : సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి
చంద్రబాబుతో న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగారు. విచారణ సమయంలో అధికారులు మిమ్మల్ని.. Chandrababu CID Interrogation

Chandrababu CID Interrogation
Chandrababu CID Interrogation : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్ ను మరోసారి పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబు రిమాండ్ ను 11 రోజుల పాటు అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్ తొలుత ఈ నెల 22వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత కోర్టు 2 రోజులు రిమాండ్ పొడిగించి సీఐడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. నేటితో(సెప్టెంబర్ 24) రిమాండ్, కస్టడీ ముగియగా.. మరోమారు రిమాండ్ ను పొడిగించింది కోర్టు.
జ్యుడీషియల్ రిమాండ్, కస్టడీ ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకబు చేవారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? వైద్య పరీక్షలు నిర్వహించారా? అని చంద్రబాబుని అడిగారు జడ్జి. దీనికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తనను అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, గైడ్ లైన్స్ ఫాలో అయ్యారని, వైద్య పరీక్షలు చేశారని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక, బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని చంద్రబాబుతో చెప్పారు న్యాయమూర్తి.(Chandrababu CID Interrogation)
ఏసీబీ కోర్టు జడ్జి, చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణ..
చంద్రబాబు గారు మీకు రెండు రోజుల పోలీసు కస్టడీ ఇచ్చాము. మీ మీద అభియాగాలపై విచారణకు ఇచ్చాము.
ఈ కస్టడీలో వచ్చిన నివేదికను పరిశీలిస్తాం.
సీఐడీ అధికారులు మిమ్మల్ని ఎలా చూశారు?
కోర్టు చెప్పిన నిబంధనలు పాటించారా? మీ న్యాయవాదులు ఎదురుగా ఉన్నారా?
చంద్రబాబు సమాధానం..
న్యాయవాదులు నా ఎదురుగానే ఉన్నారు.
జడ్జి ప్రశ్న..
విచారణలో అధికారులు మీకు ఏదైనా ఇబ్బంది కలిగించారా?
చంద్రబాబు సమాధానం..
అధికారులు నన్ను ఇబ్బంది పెట్టలేదు
జడ్జి ప్రశ్న..
కోర్టు ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారమే విచారణ చేశారు కదా?
చంద్రబాబు సమాధానం
అవును
జడ్జి ప్రశ్న..
మీకు అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదుగా?
చంద్రబాబు సమాధానం
లేదు
జడ్జి ప్రశ్న..
విచారణ సమయంలో ధర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా?
చంద్రబాబు సమాధానం
లేదు
నా విచారణకు సంబంధించి అధికారులు నివేదిక ఏమిచ్చారు? అని న్యాయమూర్తిని అడిగిన చంద్రబాబు.
600 పేజీలతో నివేదిక ఇచ్చారన్న న్యాయమూర్తి.
ఆ నివేదికను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన చంద్రబాబు.
ఒక కాపీ మీకు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తాను అని చంద్రబాబుతో చెప్పిన న్యాయమూర్తి.
మీ రిమాండ్ పొడిగిస్తున్నామని చంద్రబాబుకు తెలిపిన న్యాయమూర్తి
ఓకే అన్న చంద్రబాబు
‘విచారణ సమయంలో సీఐడీ అధికారులు గైడ్ లైన్స్ పాటించారా? లేదా? ఆరోగ్య పరీక్షలు చేశారా లేదా? నేను ఇచ్చిన డైరెక్షన్స్ ను సీఐడీ అధికారులు ఫాలో అయ్యారా లేదా? విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు మీపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి అడిగారు. అధికారులు గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యారని, అధికారులు నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని, విచారణకు నేను సహకరించాను అని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పినట్లు తెలుస్తోంది.
నా ఆరోగ్యం బాగానే ఉంది. టైమ్ టు టైమ్ నాకు టెస్టులు చేశారు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని చంద్రబాబు చెప్పారట. మీ బెయిల్ పిటిషన్ కోర్టులో ఉంది, దానిపై ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత మేము మా నిర్ణయాన్ని తెలియజేస్తాము, మీ జ్యుడీషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నాము అని చంద్రబాబుకి తెలిపారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. మీరు చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా? అని న్యాయమూర్తి అడగ్గా.. ఇంకేమీ లేదని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అనంతరం అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.