ఆధారాల్లేకుండా కారం చల్లాడు, క్షుద్రపూజలు జరిగినట్లు సీన్ క్రియేట్ చేశాడు, లా తెలివితేటలను హత్యకు వాడాడు.. వరలక్ష్మి కేసులో సంచలన నిజాలు

gajuwaka varalakshmi murder case: విశాఖ జిల్లా గాజువాకలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా అఖిల్ వరలక్ష్మి మర్డర్‌కు ప్లాన్ చేశాడు. పక్కా ప్రణాళికతో వరలక్ష్మిని చంపి కేసు తనపై రాకుండా ఉండేలా వ్యవహరించాడు. హత్య అనంతరం ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి.. పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలనే కోణంలో వ్యూహం సిద్ధం చేశాడు అఖిల్.
లా చదివిన నిందితుడు తన తెలివిని నేర స్వభావానికి వాడుకున్నాడు. నమ్మి వచ్చిన యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగినట్లు సీన్ క్రియేట్ చేశాడు. పోలీసులే ఆశ్చర్యపోయేలా మర్డర్ ప్లాన్ ప్రిపేర్ చేశాడు అఖిల్.