చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కీలక పరిణామం

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది.

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కీలక పరిణామం

Chandrababu

Updated On : December 22, 2023 / 4:23 PM IST

Chandrababu Naidu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు అధికారులను టీడీపీ నేత నారా లోకేశ్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో సీఐడీ శుక్రవారం మెమో ఫైల్ చేసింది.

చంద్రబాబు నాయుడి కేసులను విచారిస్తున్న అధికారులపై తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేశ్ అంటున్నారని చెప్పింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది. లోకేశ్ పై చర్యలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, మెమోపై లోకేశ్ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే, బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు, విజయవాడ ఏసీబీ కోర్టులోనూ సీఐడీ ఇటువంటి పిటిషనే దాఖలు చేసింది. ఇరు పక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలుగు సేన పార్టీ ధర్నా