అమరావతి భూముల కొనుగోళ్లు..మరో ఏడు కేసులు

అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ దూకుడు పెంచుతోంది. ఒక్క రోజులోనే ఏడు కేసులు నమోదు చేసింది. మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అబ్దుల్, జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణిలపై కేసులు నమోదు చేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది ప్రభుత్వ వాదన. ఈ క్రమంలో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. సీఐడీ రంగంలోకి దిగి..ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై కేసులు నమోదు చేస్తోంది. అమరావతి ప్రాంతంలో తెల్ల రేషన్ కార్డు దారులు భూములు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. 797 మంది తెల్ల రేషన్ కార్డు దారులు..761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో తేలింది. తాజాగా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసిన అనంతరం ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.