AP Corona : ఏపీలో 5,500 కరోనా యాక్టివ్ కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

AP Corona : ఏపీలో 5,500 కరోనా యాక్టివ్ కేసులు

Andhra Pradesh

Updated On : October 21, 2021 / 11:11 PM IST

AP Corona : ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,62,303కి చేరింది. ఇక మరణాల రేటు కూడా రాష్ట్రంలో చాలావరకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,327కి చేరింది. 24 గంటల వ్యవధిలో 552 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు.

చదవండి : Corona Vaccine : భారత్ మరో రికార్డు.. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 20,42,476కి చేరింది. ఇక రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, ఇంటివద్ద ఉంది కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5,500(యాక్టీవ్ కేసెస్)గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,42,162 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక రాష్ట్రంలో 90 శాతానికిపైగా ప్రజలు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది.

చదవండి : AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, భారీగా తగ్గిన మరణాలు