Covid 19 Cases AP : 24 గంటల్లో 338 కేసులు, 328 మంది డిశ్చార్జ్

Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 61 వేల 148 శాంపిల్స్ పరీక్షించినట్లు, గడిచిన 24 గంటల్లో 328 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, బుధవారం వరకు రాష్ట్రంలో 1,18,25,566 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 79 వేల 391కి కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 3 వేల 262 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 69 వేల 021 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాల వారీగా :
అనంతపురం : 16. చిత్తూరు 65. ఈస్ట్ గోదావరి : 42. గుంటూరు : 38. కడప : 20. కృష్ణా : 44. కర్నూలు : 06. నెల్లూరు : 18. ప్రకాశం : 15. శ్రీకాకుళం : 13. విశాఖపట్టణం : 34. విజయనగరం : 08. వెస్ట్ గోదావరి : 19. మొత్తం 338.
#COVIDUpdates: 31/12/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,79,391 పాజిటివ్ కేసు లకు గాను
*8,69,021 మంది డిశ్చార్జ్ కాగా
*7,108 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,262#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/OTOh93whhg— ArogyaAndhra (@ArogyaAndhra) December 31, 2020