AP Covid Cases : ఏపీలో కొత్తగా 150 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 150 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Ap Covid Cases
AP Covid Cases : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 150 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ నుంచి 217 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,760 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20లక్షల 67 వేల 706 కి చేరింది.
వీరిలో 20 లక్షల 49 వేల 555 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ముగ్గుర మరణించారు. చిత్తూరు,గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కోక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,391కు చేరింది.
Also Read : Puneeth Rajkumar : వైరల్ అవుతున్న పునీత్ పిక్స్.. ఫ్యాన్స్ ఎమోషనల్..
మరో వైపు దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 107,92, కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ వేశారు.

Andhra Pradesh Covid