నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

AP Assembly Winter Meetings : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి గురువారం (నవంబర్ 26, 2020) సమావేశాలపై నోటిఫికేషన్ విడుదల చేశారు.
30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. డిసెంబర్ 4వరకు సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది.
ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.