AP Cabinet Key Decisions : పేదలకు ఇళ్ల స్థలాలు, వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం అమలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
అందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి ఆమోదం.

CM Chandrababu Naidu
AP Cabinet Key Decisions : ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించారు. మరో కీలక అంశం.. భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఇందులో భాగంగా కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ ఫ్రా కార్పొరేషన్ కు కేటాయించిన 2వేల 500 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనపైన కూడా క్యాబినెట్ లో డిస్కస్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చించారు. ఇక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* 62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
* ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణా నదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 294 కోట్ల రూపాయలు ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం
* అందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి ఆమోదం
* పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం
* ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.700 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయం
Also Read : మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
* గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి రేషనలైజేషన్ విధానంపై కీలక చర్చ
* గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటునకు క్యాబినెట్ నిర్ణయం
* ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిక్ డ్యూటీ టారిఫ్ తగ్గింపు
* నాగావళి నది మీద గౌతులచ్చన్న చోటపల్లి బ్యారేజ్ కు హైడ్రాలిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
* అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు క్యాబినెట్ నిర్ణయం
* నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమాలపై మంత్రివర్గ ఉప సంఘం
* నిషేధిత జాబితాలో ఉన్న దాదాపు 7లక్షల ఎకరాల భూములను తొలగించారని గుర్తించిన ప్రభుత్వం
* దానిపై అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న మంత్రివర్గ ఉప సంఘం
Also Read : లీడర్, క్యాడర్ గప్‌చుప్..ఇట్లైతే ఫ్యాన్ తిరిగేదెట్లా.?
వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకం అమలు..
ఇక, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చర్చించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్, అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.