CM Jagan Kadapa Tour : నేటి నుంచి సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఏపీ సీఎం జగన్ నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సీఎం పర్యటన కొనసాగనుంది. మూడు రోజులపాటు సాగే పర్యనటలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

CM JAGAN
CM Jagan Kadapa Tour : ఏపీ సీఎం జగన్ నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సీఎం పర్యటన కొనసాగనుంది. మూడు రోజులపాటు సాగే పర్యనటలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ కడప అమీన్ పీర్ దర్గాను సీఎం జగన్ సందర్శించనున్నారు. అక్కడి నుంచి ఏపీ పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలు వీరారెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం వివాహ వేడుకలకు హాజరుకానున్నారు.
అక్కడి నుంచి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని కమలాపురం చేరుకోనున్నారు. కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. అక్కడ వివిధ అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఇడుపులపాయ చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరుకానున్నారు.
CM Jagan : ఢిల్లీలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు..
ఆ తర్వాత పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని, సభకు హాజరవుతారు. అనంతరం అహోబిలం స్కూల్ అభివృద్ధి పనులు, జీపీఎస్ పనులను ప్రారంభించనున్నారు. ఇక ఆదివారం క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందుల నుంచి బయల్దేరి తాడేపల్లికి తిరిగి రానున్నారు.