ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ..!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ..!

New Ration Cards (Photo Credit : Google)

Updated On : October 9, 2024 / 4:52 PM IST

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల భర్తీ, 4వేల కొత్త రేషన్ షాపుల ఏర్పాటుపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. అటు త్వరలోనే కొత్త రేషన్ కార్డుల తుది డిజైన్ కూడా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

కొత్త సభ్యుల చేర్పులు, అడ్రస్ లో మార్పులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ అంశం ఎంతో కాలంగా పెండింగ్ లో ఉంది. దీనిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు పాత రేషన్ కార్డులో కొత్త వారిని చేర్చడం, అడ్రస్ మార్పు తదితర వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఇదొక అజెండాగా ప్రభుత్వం పెట్టుకుంది.

Also Read : సెంచరీ దాటిన టమాట ధర.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయంతో బారులుతీరిన కొనుగోలుదారులు

మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ..
చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త సభ్యులను కార్డులో చేర్చుకోవడం, అడ్రస్ మార్పు తదితర అంశాలు చాలా కాలంగా నిలిచిపోవడంతో.. లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

4వేల కొత్త రేషన్ షాపులు..!
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి 4వేల కొత్త రేషన్ షాపులు కూడా భర్తీ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తైంది. అటు, రేషన్ డీలర్ల భర్తీని పూర్తి చేయడం, ఇటు కొత్త రేషన్ షాపుల ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, అడ్రస్ ల మార్పులు, కొత్త సభ్యుల చేర్పులతో పాటు తొలగింపుల ప్రక్రియకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గురువారం మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో వీటిపై డిస్కస్ చేసి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

 

Also Read : ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. మా వాళ్లు కూడా ఆ బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు..