Global Tenders : వ్యాక్సిన్ల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..గ్లోబల్ టెండర్స్

Global Tenders : వ్యాక్సిన్ల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..గ్లోబల్ టెండర్స్

Vaccine

Updated On : May 13, 2021 / 5:44 PM IST

AP government : కరోనాకు చెక్ పెట్టేందుకు కీలకంగా మారిన..వ్యాక్సిన్ల విషయంలో…ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గ్లోబల్ టెండర్స్ ఆహ్వానించింది. దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి సంస్థలకు మూడు వారాల గడువు విధించింది. ఈ మూడు వారాల్లోగా..ఆసక్తి వ్యక్త పరచాలని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు అందించకపోతుండడంతో సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా టెండర్లను ఆహ్వానించింది.

2021, మే 13వ తేదీ గురువారం సాయంత్రం సీఎం జగన్ కరోనా కట్టడిపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు (కోవాగ్జిన్, కోవీషీల్డ్)లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే..అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉండడంతో ఉత్పత్తి స్పీడప్ గా లేదు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సినేషన్లు సరిపడా..ఏపీకి రావడం లేదు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమౌతోంది. దీంతో గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏ కంపెనీలు ఏపీకి వ్యాక్సిన్లు అందిస్తాయో మూడు వారాల్లో తెలియనుంది.

Read More : Supreme Court : వలస కార్మికుల క్షేమం కోసం సుప్రీం సూచనలు, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దు