Salaries Hike: ఏపీలో ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంపు.. 8వేల వరకు పెంచుతూ ఆర్డర్స్

ఈ కేటగిరి విద్యాసంస్థల్లోని పీజీటీ ల వేతనాలను రూ.25వేల నుంచి రూ.31,250కు పెంచింది.

Salaries Hike: ఏపీలో ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంపు.. 8వేల వరకు పెంచుతూ ఆర్డర్స్

Updated On : July 1, 2025 / 5:59 PM IST

Salaries Hike: ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 8వేల వరకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలు పెంచింది ప్రభుత్వం. 1659 మంది అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

* కేటగిరి ఎ లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో పని చేసే బోధనా సిబ్బంది వేతనాలు పెంపు
* జూనియర్ లెక్చరర్లు, పీడీ(సి), లైబ్రేరియన్ల వేతనం రూ.18000 నుంచి రూ.24,150 కి పెంపు
* పీజీటీల వేతనాన్ని రూ.16,100 నుంచి రూ.24,150 పెంపు
* టీజీటీ, పీడీ(ఎస్) వేతనాన్ని రూ.14800 నుంచి రూ.19350కి పెంపు
* పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బంది వేతనం రూ.10900 నుంచి రూ.16300కి పెంపు

కేటగిరీ బి లోని స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బంది వేతనాలు పెంచింది ప్రభుత్వం. ఈ కేటగిరి విద్యాసంస్థల్లో పనిచేసే 40 మంది జూనియర్ లెక్చరర్లు, 18 మంది పీజీటీల వేతనాలను పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేటగిరి విద్యాసంస్థల్లోని పీజీటీ ల వేతనాలను రూ.25వేల నుంచి రూ.31,250కు పెంచింది.

Also Read: ఒక్కొక్కరికి రూ.3వేలు.. నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు ప్రకటన.. త్వరలోనే శ్రీకారం..

ఇక, కేటగిరీ సీ లోని అరకు వాలీ బాలుర స్పోర్ట్స్ స్కూల్ లో పనిచేసే బోధన సిబ్బంది వేతనాలు పెంచింది. కోచ్ వేతనాన్ని రూ.25వేల నుంచి రూ.31,250కు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అసిస్టెంట్ కోచ్ వేతనాన్ని రూ.22 వేల నుంచి రూ.27,500 కు పెంచింది.

ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్.