కౌన్సిల్ క్యాన్సిల్ : కేంద్రం ఒకే అంటుందా ? రాష్ట్రపతి ఆమోదం వేస్తారా

మరోసారి ఏపీ శాసనమండలి రద్దు కానుందా ? రద్దు తీర్మానంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ? దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారా ? ఎన్ని రోజుల సమయం పడుతుంది ? లాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మండలి రద్దుకు తీర్మానం చేసింది. అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశ పెట్టనుంది.
అసెంబ్లీలో చర్చ పెట్టి ఆమోదించాలి. 2/3 వంతుల మద్దతు ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం..మండలి ఏర్పాటు..రద్దు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతారు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తప్పనిసరి. పార్లమెంట్‌లో ఉభయసభలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఇరు సభలు ఆమోదం తెలిపిన తర్వాతే..రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. ఆయన ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కేంద్రం ఒప్పుకుంటే..త్వరగానే రద్దయ్యే అవకాశం ఉంటుంది.
* ఎన్టీఆర్ హయాంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే మండలి రద్దు చేయగలిగారు.
* జగన్ సర్కార్ మండలి రద్దుకి మొగ్గుచూపింది.
* మండలి రద్దు వారం రోజుల్లో కూడా జరగొచ్చు.
* అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యను బట్టి ఉంటుందని, ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
* రద్దుకి ఎక్కువ టైమ్ పట్టకపోవచ్చని తెలుస్తోంది.
* ఇప్పటికే మండలి రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారని.. అందుకు ఆయన అభ్యంతరం తెలపలేదనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
* ఇదే నిజమైతే ఏపీ మండలి అతి త్వరలోనే కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తుంది.
Read More : మండలి రద్దయినా..సెలెక్ట్ కమిటీ రద్దు కాదు – యనమల