ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు సతీవియోగం.. చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు సంతాపం

ఆంధ్రప్రదేశ్ మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి షెహనాజ్ కన్నుమూశారు.

ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు సతీవియోగం.. చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు సంతాపం

Minister nmd farooq

Updated On : March 21, 2025 / 11:34 AM IST

AP Minister Farooq Wife Passedaway: ఆంధ్రప్రదేశ్ మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి షెహనాజ్ కన్నుమూశారు. కొద్దికాలంగా ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఆమె ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. షెహనాజ్ పార్ధీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు. రేపు అంత్యక్రియలను నిర్వహించే అవకాశం ఉంది.

 

మంత్రి ఫరూక్ సతీమణి షెహనాజ్ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ తదితరులు సంతాపం తెలిపారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు. షెహనాజ్ పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జన్నత్ లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. షెహనాబ్ మృతితో విషాదంలో ఉన్న మంత్రి ఫరూక్, వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఫరూక్ కుటుంబానికి అల్లా మనోధైర్యాన్ని అందించాలని పార్థించారు. మంత్రి నారాయణ షెహనాజ్ మృతికి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు. మంత్రి ఫరూక్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

మంత్రి ఫరూక్ సతీమణి మృతిపట్ల మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మంత్రి ఫరూక్ గురువారం సమావేశాలకు హాజరయ్యారు. నిన్న సాయంత్రం నంద్యాల వెళ్లారు. అయితే, సతీమణి మరణవార్తతో ఆయన హుటాహుటీన హైదరాబాద్ వెళ్లారు.