AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 310 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది చనిపోయారు.

Ap Corona Cases
AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. అయితే మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 310 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9వేల 692 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
కడప, విశాఖపట్నం జిల్లాలలో కోవిడ్ తో ముగ్గురు చొప్పున మరణించారు. నెల్లూరులో ఇద్దరు చనిపోయారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.
Karimnagar : కారు నడిపింది 14 ఏళ్ల మైనర్.. బ్రేక్‌కు బదులు క్లచ్ తొక్కడంతో ప్రమాదం
రాష్ట్రంలో ప్రస్తుతం 1,16,031 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల 296మందికి కరోనా టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా 1697 కరోనా కేసులు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో 1379, కృష్ణా జిల్లాలో 1008 కరోనా కేసులు నమోదయ్యాయి.
Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్
శనివారం రాష్ట్రంలో 11వేల 573 కరోనా కేసులు, మూడు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసులు సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య పెరగడం కలవరానికి గురి చేస్తోంది. నేటి వరకు రాష్ట్రంలో 3,24,45,428 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 606కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,70,491. రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 21,39,854.
#COVIDUpdates: 30/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,70,491 పాజిటివ్ కేసు లకు గాను
*21,39,854 మంది డిశ్చార్జ్ కాగా
*14,606 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,16,031#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/4Tak2xzmrT— ArogyaAndhra (@ArogyaAndhra) January 30, 2022