AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : January 31, 2022 / 6:35 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11వేల 384 మంది కోవిడ్ నుంచి పూర్తిగా
కోలుకున్నారు. ఆదివారం 10వేల 310 కోవిడ్ కేసులు నమోదవగా.. ఒక్కరోజులోనే 5వేలకు పైగా కేసులు తగ్గడం ఊరటనిచ్చే అంశం.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

రాష్ట్రంలో ప్రస్తుతం 1,10,517 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 25వేల 284మందికి కరోనా టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 854 కేసులు వచ్చాయి. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 823 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 776, కృష్ణా జిల్లాలో 650 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,76,370. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,51,238. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 615కి పెరిగింది.