AP Corona : ఏపీలో కరోనా విలయం.. 23వేలకు పైగా కొత్త కేసులు, 100కు పైగా మరణాలు..
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 106 మంది మృతి

Corona In Ap
AP Corona Cases : ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 106 మంది మృతి చెందగా.. 24వేల 819 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637 శాంపిల్స్ పరీక్షించగా.. 14,98,532మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 12,79,110మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 9వేల 686మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పశ్చిమగోదావరిలో అధిక మరణాలు
రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 17మంది కొవిడ్‌తో మృతిచెందగా.. విశాఖ, నెల్లూరులో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మృత్యువాతపడ్డారు. గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3వేల 528 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరు(2670), అనంతపురం(2334) జిల్లాల ఉన్నాయి.
#COVIDUpdates: 19/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,95,637 పాజిటివ్ కేసు లకు గాను
*12,76,215 మంది డిశ్చార్జ్ కాగా
*9,686 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,09,736#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/q8zEjJCrJg— ArogyaAndhra (@ArogyaAndhra) May 19, 2021
#COVIDUpdates: As on 19th May 2021 10:00 AM
COVID Positives: 14,95,637
Discharged: 12,76,215
Deceased: 9,686
Active Cases: 2,09,736#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/uAMkIJuqqq— ArogyaAndhra (@ArogyaAndhra) May 19, 2021