B Tech Ravi: నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారు: బీటెక్ రవి

తనకు ఏదైనా జరిగితే జగన్, భారతీ, ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యతని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ..

B Tech Ravi: నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారు: బీటెక్ రవి

B Tech Ravi-Jagan

Updated On : December 29, 2023 / 1:03 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ, కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి పలు ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గన్‌మన్లను తొలగించారని అన్నారు. ‘బీటెక్ రవికి ఏదైనా జరిగితే బాధ్యత నాదే’ అని జగన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాన్వాయ్‌తో వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని బీటెక్ రవి చెప్పారు. తనకు ఏదైనా జరిగితే జగన్, భారతీ, ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యతని అన్నారు. వైసీపీ రాష్ట్రంలో ఉన్న భవనాలను కూల్చి, పునఃనిర్మిస్తోందని విమర్శించారు. ఆ డబ్బును సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే రైతులకైనా మేలు జరిగేదని చెప్పారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంపై వైసీపీ దృష్టి పెట్టట్లేదని అన్నారు. నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల మార్పుల్లో భాగంగా జగన్ తనను తాను మార్చుకోవాలని బీటెక్ రవి అన్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి తానూ పోటీ చేసేలా చంద్రబాబు తనకు అవకాశం కల్పించాలని చెప్పారు.

జగన్‌‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో జగన్‌రీ ఇదే చివరి క్రిస్మస్ అని అన్నారు. జగన్ గండికోట, రాజోలి, భూ బాధితులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పారు.

Nara Lokesh: ఏపీ ఎన్నికల వేళ వైసీపీలో సీట్ల కసరత్తుపై నారా లోకేశ్ ఆసక్తికర కామెంట్స్