ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం : బీజేపీ-జనసేన పొత్తు
ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు

ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. పొత్తుపై బీజేపీ-జనసేన అధికారిక ప్రకటన చేసింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని నేతలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సంయుక్త భేటీలో ఇరు పార్టీల నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు.
గురువారం(జనవరి 16,2020) విజయవాడలోని ఓ హోటల్ లో బీజేపీ-జనసేన కీలక నేతల మధ్య సుదీర్ఘ సమావేశం(మూడున్నర గంటలు) జరిగింది. ఈ సమావేశంలో ఇరు పార్టీల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలోని పరిణామాలపై సమావేశంలో చర్చించారు. పొత్తు కుదుర్చుకున్నారు.
* ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ
* కలిసి పని చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయం
* విలీనానికి నో చెప్పిన పవన్.. బీజేపీతో పొత్తులే అని ప్రకటన
* పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చిన రెండు పార్టీలు
* బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ ముందుకొచ్చారు-కన్నా
* అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తాం-కన్నా
* బేషరతుగా బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ ముందుకొచ్చారు-కన్నా
* బీజేపీ-జనసేన కలయిక చరిత్రాత్మకం-కన్నా
* ఏపీలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న పార్టీలపై పోటీ చేస్తాం-కన్నా
* ప్రజా సమస్యలపై కలిసి పోరాడతాం-కన్నా
* దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి పని చేసేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు
* ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారు-కన్నా
* జనసేనతో కలిసి పని చేయడాన్ని స్వాగతిస్తున్నాం-కన్నా
* రాష్ట్రాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నాం-నాదెండ్ల