ఏప్రిల్ 15 నుంచి APSRTC బస్సులకు టికెట్ల బుకింగ్ ప్రారంభం

  • Published By: chvmurthy ,Published On : April 6, 2020 / 11:57 AM IST
ఏప్రిల్ 15 నుంచి APSRTC బస్సులకు టికెట్ల బుకింగ్ ప్రారంభం

Updated On : April 6, 2020 / 11:57 AM IST

ఏప్రిల్  15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్‌లైన్‌ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది.  వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

విజయవాడ బస్టాండ్‌ నుంచి నాన్‌ ఏసీ సర్వీసులను మాత్రమే ఆర్టీసీ ప్రారంభించనుంది. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి మాత్రం ఏసీ సర్వీసులను నడపనున్నారు.

కరోనా వైరస్‌ ఏసీలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఈనెల 15వ తేదీన 115 సర్వీసులకు టిక్కెట్‌ బుకింగ్స్‌ అందుబాటులో తీసుకురాగా, వీటిల్లో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి 10 ఏసీ బస్సులే ఉన్నాయి. మిగిలిన 105 సర్వీసులు సూపర్‌ లగ్జరీ బస్సులు.(కరోనా హాట్‌స్పాట్స్: 62 జిల్లాల్లోనే 80శాతం కరోనా కేసులు)

విజయవాడ నుంచి తిరుపతికి 45 సర్వీసులు నడపనున్నారు. వీటిల్లో కేవలం ఐదు మాత్రమే ఏసీ సర్వీసులు ఉన్నాయి. చెన్నైకు మూడు సర్వీసులు ఉంటే, రెండు సూపర్‌ లగ్జరీ కాగా ఒకటి ఏసీ సర్వీసు ఉంది. అదీ కూడా కాకినాడ డిపో నుంచి వస్తుంది.