Chandrababu : వైసీపీకి ఇక 8 నెలలే, మళ్లీ వచ్చేది టీడీపీనే, వైజాగ్ ప్రజలకు భయం పట్టుకుంది-చంద్రబాబు

Chandrababu : రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్. వైసీపీ ఎక్స్ పైర్ అయిపోయే పార్టీ. జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు.

Chandrababu : వైసీపీకి ఇక 8 నెలలే, మళ్లీ వచ్చేది టీడీపీనే, వైజాగ్ ప్రజలకు భయం పట్టుకుంది-చంద్రబాబు

Chandrababu (Photo : Google)

Updated On : April 20, 2023 / 12:11 AM IST

Chandrababu : వైసీపీ ప్రభుత్వానికి ఇక 8 నెలల సమయం మాత్రమే ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అందరం కలిసి వైసీపీని చిత్తుగా ఓడిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ్ముడి కేసు నుండి ప్రజలను డైవర్ట్ చేసేందుకే విశాఖ రాజధాని అంశాన్ని జగన్ తెరమీదకు తెచ్చారని, త్వరలో విశాఖ పోతానంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరని, అక్కడి ప్రజలు చాలా తెలివైన వారని చంద్రబాబు అన్నారు. జగన్ మా భూములు ఎక్కడ కబ్జా చేస్తారోనని వైజాగ్ ప్రజలు భయపడి పోతున్నారని చంద్రబాబు చెప్పారు. గిద్దలూరు సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.(Chandrababu)

” నాలుగేళ్ల 3 నెలల కాలంలో వైసీపీ ఏ అభివృద్ధి చేయలేదు. అందుకే వైసీపీ ఎక్స్ పైర్ అయిపోయే పార్టీ. ఇక 8 నెలలే వైసీపీకి సమయం ఉంది. రాష్ట్రంలో నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్, గ్యాస్, ఆర్టీసీ, ఇంటిపన్నులు, ఇసుక ధరలను భారీగా పెంచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఫ్రీగా ఇచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపితే నేడు వైసీపీ నాయకులకు ఇసుక ఒక ఆదాయ వనరుగా మారింది. నాణ్యత లేని బ్రాండ్స్ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి వాటిపై వఛ్చే పర్సెంటేజీలతో దోచుకుంటున్నారు.

Also Read..AP CM Jagan : సెప్టెంబర్‌ నుండి విశాఖ నుంచే పాలన.. నేను కూడా అక్కడే ఉంటా : సీఎం జగన్‌

రాష్ట్రంలో ఉద్యోగులకు, పోలీసులకు మెదటి తేదీన జీతాలు, డీఏలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్. వేలకోట్ల అక్రమాలకు పాల్పడటంతో ఈడీ, సీబీఐ చార్జిషీటు వేశాయి. మమ్మల్ని కాదు జైల్లో పెట్టాల్సింది. కోడి కత్తి డ్రామాలాడిన కమల్ హాసన్ ని, బాబాయ్ పై గొడ్డలి పోటు వేసిన వారిని జైల్లో పెట్టాలి. సొంత మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్. బాబాయ్ ది గొడ్డలి పోటు కాదు గుండె పోటు అన్నది ఎవరు? మేమా? మీరా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఓ కేస్ స్టడీ. జగన్ పాలన ఓ అక్రమ పాలన.(Chandrababu)

ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుంటే గిద్దలూరు సస్యశ్యామలం అయ్యేది. వెలుగొండ ప్రాజెక్టును సమైక్యాంధ్ర ప్రదేశ్ హయాంలో నేనే ప్రారంభించా. దానిని నేనే పూర్తి చేస్తా. 2014లో అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తుంటే కాంట్రాక్టర్ ను మార్చి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాను. కేవలం 5శాతం పెండింగ్ లో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ను నేటికీ వైసీపీ చేయలేకపోయింది. అటువంటిది వీళ్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేది. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వాడిని. నదులను అనుసందానం చేసేవాడిని.(Chandrababu)

మళ్లీ 2024లో అధికారంలోకి వచ్చేది టీడీపీనే. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల ఉద్యోగాలు ఇచ్చాం. నేడు మటన్. చేపల కొట్లలలో సీఎం జగన్ ఉద్యోగాలు ఇస్తాడట. నేను ఎక్కడికి వెళ్లినా జాబు రావాలంటే జాబు రావాలనే నినాదం అన్ని వర్గాల నుండి వినిపిస్తోంది. జగన్ రాష్ట్ర భవిష్యత్ కాదు సమాజాన్ని పట్టిస్తున్న క్యాన్సర్ గడ్డ. జగనే మీ నమ్మకం అంట. కాదు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.

Also Read..YS viveka case : సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుంచి నాకు ప్రాణహాని ఉంది : కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

ఆరు నెలల్లో ఇంటికి పోబోతున్న జగన్ సాధించింది ఏదైనా ఉందా? అని అడుగుతున్నా. సమైక్యాంధ్ర హయాంలో హైదరాబాద్ లో జినో వ్యాలీ వ్యాక్సిన్, రింగ్ రోడ్ వంటి అనేక అభివృద్ది పనులు చేసిన ఒక విజనరీ చరిత్ర టీడీపీది. తిరుపతి గంజాయికి నిలయంగా మారింది. అపవిత్రంగా మారుస్తున్న వారిని ఆ వేంకటేశ్వరుడు చూసుకుంటాడు. మరో డ్రామాతో సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడు. ఆయన పేదవాడంట. మనం భూస్వాములమంట. నిన్ననే ఏడీఆర్ ప్రకటించిన నాయకుల ఆస్తుల విలువలో దేశంలోనే అందరి ముఖ్యమంత్రులకు ఉన్న ఆస్తులన్నీ కలిపితే సీఎం జగన్ కున్న ఆస్తులు లేవు. దేశంలోనే ధనికుడైన సంపన్నుడైన ఈ వ్యక్తి పేదోడట.(Chandrababu)

వైసీపీకి చెందిన సర్పంచ్ తాను వైసీపీకి ఓటు ఎందుకు వేశానా అని చెప్పుతో కొట్టుకున్నాడు. అదే విధంగా బద్వేల్ లో ఓ ముస్లిం సోదరుడు వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానని దానికి ప్రాయచిత్తంగా టీడీపీకి 50వేల ఫండ్ ఇస్తున్నానని, తనను క్షమించమని కోరే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ప్రజల అనుమతి లేనిది వారి ఇంటికి జగన్ స్టిక్కర్లు వేయడానికి వీలు లేదు. దీనిని ప్రశ్నించిన వారిపై వైసీపీ ధాడులకు దిగుతోంది. వైసీపీ నాయకులు కొందరు ఫేక్ గా మారి టీడీపీ కండువా కప్పుకుని ప్రజలను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నారు.

గిద్దలూరు మీదుగా వెళ్లే అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవేను టీడీపీ ప్రతిపాదిస్తే దానిని రూటు మార్చి పులివెందులకు తీసుకెళ్లి గిద్దలూరు ప్రజలను జగన్ మోసం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేసే బాధ్యత నాది. టీడీపీ హయాంలో గిద్దలూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.900 కోట్ల నిదులు కేటాయిస్తే దానిని సీఎం జగన్ రద్దు చేశాడు. సగిలేరు ముంపు, రోడ్ల అభివృద్ది కోసం నిధులు కేటాయిస్తే వాటినీ రద్దు చేశాడు. భావి తరాల భవిష్యత్ కోసం ఇంటికొక జెండాను ప్రజలు పట్టాలి.(Chandrababu)

అక్రమ కేసులు పెడుతున్న వైసీపీపై అందరం కలిసి తిరుగుబాటు చేసి చిత్తు చిత్తుగా ఓడిద్దాం. గిద్దలూరు గర్జించింది. ఎప్పుడూ చూడని ప్రజా స్పందనను ఇప్పుడు చూస్తున్నా. రాష్ట్రానికి క్రమశిక్షణ నేర్పడంతో పాటు చట్టాన్ని గౌరవించి పోలీసులకు విలువ ఇచ్చిన పార్టీ టీడీపీ. రాష్ట్రంలో 5కోట్ల ప్రజలు ఒక పక్క, సైకో జగన్ ఒక పక్క” అని విరుచుకుపడ్డారు చంద్రబాబు.