Chandrababu Naidu: నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు
ప్రజల ఆదరణతో నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని చంద్రబాబు చెప్పారు.

CM Chandrababu Naidu
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనపడిందని తెలిపారు.
నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. చాలా అరుదైన ఘటనలను తన రాజకీయ జీవితంలో చూశానని తెలిపారు. గత వైసీపీ సర్కారు హయాంలో తన కుటుంబంపై అవమానాలు, ఆరోపణలు చేశారని అన్నారు.
అధికారం కొత్త కాదని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ అప్పులు, పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు అవుతుందని తెలిపారు.
ప్రజల ఆదరణతో నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఏ నేతకూ దక్కని గౌరవం తనకు దక్కిందని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసమే నేను పనిచేస్తానని అన్నారు. అధికారం తనకు కొత్త కాదని, కేంద్ర రాజకీయాలు నాకు కొత్తకాదని తెలిపారు.
Errabelli Dayakar Rao: నాపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు: ఎర్రబెల్లి