సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకుంటూ కుట్ర: భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్
భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై అపచారం చేశారని అన్నారు.

Bhumana Karunakar Reddy
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజిలెన్స్ కమిటీ ద్వారా, మూడు నెలల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కుట్ర చేశారని తెలిపారు. భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై అపచారం చేశారని అన్నారు.
ఆరోపణలు నిరూపించడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపాలని కోరుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంలో మోదీ కల్పించుకోవాలని, భక్తుల మనోభావాలను సర్వ నాశనం చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారని చెప్పారు. చంద్రబాబు బెదిరించిన తర్వాతే పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయని ఈవో అంటున్నారని తెలిపారు.
అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా టీడీపీ పాలనలో కూడా జరిగిందని చెప్పారు. టీడీపీ పాలనలో 14 సార్లు నెయ్యి తిరిగి పంపించినది వాస్తవం కాదా అని నిలదీశారు. 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు విస్మరించారని, తప్పు చేసింది ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడికి పాప పరిహారం తప్పదని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ 11 రోజుల దీక్ష.. వైసీపీ ఆఫీసుపై దాడిపై అంబటి రాంబాబు కామెంట్స్