Cm Chandrababu Naidu : సూపర్ 6 అమలు దిశగా దూసుకుపోతున్న ఏపీ సర్కార్..

ఇక సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు.

Cm Chandrababu Naidu : సూపర్ 6 అమలు దిశగా దూసుకుపోతున్న ఏపీ సర్కార్..

Updated On : December 31, 2024 / 9:28 PM IST

Cm Chandrababu Naidu : హామీల అమలు దిశగా కూటమి సర్కార్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి హామీలను నెరవేర్చిన చంద్రబాబు సర్కార్.. 2025లో మిగిలిన హామీలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంపై ఫోకస్ పెట్టారు.

2025లో ఎట్టి పరిస్థితుల్లో హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు చంద్రబాబు. 2025లో ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే విధంగా స్త్రీ నిధి, తల్లికి వందనం, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. ఇలా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసుకుంటోంది.

Also Read : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు..

ఇక సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు. ఇందుకోసం రూ.1500 కోట్లు కూడా కేటాయించారు. గత 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టింది కూటమి సర్కార్. 2025లో మొత్తం హామీలు పూర్తి చేయాలని సంకల్పం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం వ్యవహారాల్లో చాలా స్పీడ్ గా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ కూటమి ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి రూ.3వేలు 2025లో అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా చంద్రబాబు సర్కార్ పాలసీలు తయారు చేస్తోంది.

రానున్న రోజుల్లో దాదాపు 2-3 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 2025లో తమ లక్ష్యాలను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు, పార్టీ నేతలు, ప్రజలు.. ఇలా అందరూ తమతో కలిసి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిస్తున్నారు.

* హామీల అమలు దిశగా దూసుకుపోతున్న ఏపీ సర్కార్
* మిగిలిన హామీలు 2025లో అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు
* 2025లో కార్యరూపం దాల్చనున్న సీఎం చంద్రబాబు ప్రణాళికలు
* ఉగాదికి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం..!
* యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సర్కార్ కసరత్తు
* తల్లికి వందనం, స్త్రీ నిధి, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు కృషి
* నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇచ్చేందుకు కార్యాచరణ
* రోడ్ల నిర్మాణానికి రూ.1500 కోట్లు కేటాయింపు

Also Read : 9 ప్రాజెక్టులు, రూ.లక్ష 82 వేల 162 కోట్ల పెట్టుబడులు.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ..!