పోలవరం, రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం..

పోలవరం, రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Updated On : June 20, 2024 / 2:48 PM IST

అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ… ఇక్కడి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని చెప్పారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. అటువంటి రాజధానిని వైసీపీ సర్కారు నాశనం చేసిందని చెప్పారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని చెప్పారు. రాజధాని, పోలవరం రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని తెలిపారు.

అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదని తెలిపారు. అవి ప్రజల సంపదలని, వారికే సొంతమని చెప్పారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని తెలిపారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేసిందని చెప్పారు. పోలవరం విషయంలో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. కాగా, విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఎన్నికల్లో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదని చెప్పారు.


Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త సిగ్నేచర్ చూశారా..? డిప్యూటీ సీఎం అయ్యాక సంతకం మార్చిన పవన్..?