CM Chandrababu Naidu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ..

ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.

CM Chandrababu Naidu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ..

CM Chandrababu Naidu

CM Chandrababu Polavaram Tour : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. పోలవరంతోపాటు మిగిలిన జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. కేంద్రం నుంచి పోలవరంకు రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టిపెట్టిన సీఎం.. నిర్దేశిత సమయంలోగా పోలవరంతోపాటు మిగిలిన ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పోలవరంపై ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదలకు టీడీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Also Read : BRS Party : హస్తంవైపు వారి చూపు.. మండలిలో త్వరలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా?

సచివాలయంలో అన్ని శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతీసోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. వారంవారం జరుగుతున్న పనులపై సమీక్ష జరిపిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అదే విధానాన్ని అనుసరించనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమగ్రంగా చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారు.

Also Read : TTD : టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావును నియమించిన ఏపీ ప్రభుత్వం