Cm Chandrababu Naidu : అధికారం అండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకున్నారు- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఈ తరహా నేరాల పట్ల కొత్త కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Cm Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కాకినాడ పోర్టు సెజ్ లో బలవంతంగా వాటాలు రాయించుకున్నారని ఆరోపించారు. అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు తీసుకున్నారని చెప్పారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు చరిత్రలో లేవన్న చంద్రబాబు.. ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఆస్తులు పొగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు చంద్రబాబు.
గత ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయన్నారు. కాకినాడ సెజ్, కాకినాడ పోర్టులో ఏ విధంగా బెదిరించి, అధికారాన్ని దుర్వినియోగం చేసి వాటాలు దక్కించుకున్నారో చంద్రబాబు వివరించారు. ఏపీ చరిత్రలోనే ఇటుంటి దురాగతాలు ఎక్కడా చూడలేదన్నారు. గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని పేట్రేగిపోయారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అరవిందో గ్రూప్ ఏ విధంగా వాటా దక్కించుకుందో చూస్తున్నామన్నారు. గన్నులు పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, వ్యాపారంలో వాటాలు రాయించుకోవడం… ఈ తరహా నేరాలు దేశ చరిత్రలోనే లేవన్నారు చంద్రబాబు.
ఈ తరహా నేరాల పట్ల కొత్త కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రమైన ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అవినీతి గురించి విన్నాం కానీ, ఈ విధంగా బెదిరించి వాటాలు రాయించుకోవడం ఎక్కడా చూడలేదని చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భూ వివాదాల ఫిర్యాదులు టీడీపీ కార్యాలయానికి ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు చంద్రబాబు.
Also Read : ఇక నుంచి నిఘా నీడలో కాకినాడ పోర్టు.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత?