Sankranthi Celebrations : సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండగ సంబరాలు మొదలు పెట్టారు.

CM Jagan
YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండగ సంబరాలు మొదలు పెట్టారు. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలాఉంటే అంతకు ముందు సీఎం జగన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ ట్వీట్ ప్రకారం.. ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.