Ambati Rambabu : నో డౌట్.. పోలవరాన్ని ఆయనే పూర్తి చేస్తారు, సత్తెనపల్లి నాదే- మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu : భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగిన స్థాయిలో చూపిస్తున్నారు. గైడ్ బండ్ పెద్ద సమస్యే కాదు.

Ambati Rambabu : నో డౌట్.. పోలవరాన్ని ఆయనే పూర్తి చేస్తారు, సత్తెనపల్లి నాదే- మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu

Updated On : June 11, 2023 / 6:05 PM IST

Ambati Rambabu – Polavaram : పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ, బీజేపీ, జనసేనలపై ఆయన నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అవాస్తవలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ని కచ్చితంగా సీఎం జగన్ మోహన్ రెడ్డినే పూర్తి చేస్తారని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

చంద్రబాబు నేతృత్వంలో తీవ్రమైన తప్పిదాలు:
”ఈ నెల 6న సీఎం జగన్ మోహన్ పోలవరాన్ని సందర్శించారు. ఒక పత్రిక పుంఖానుపుంఖాలుగా వార్తలు వండి వడ్డిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పురోగతి లేదని ప్రచారం చేస్తున్నారు. పోలవరం సందర్శన పేరుతో టీడీపీ నేతలు నిన్న గందరగోళం సృష్టించారు. పోలవరంలో చంద్రబాబు నేతృత్వంలో తీవ్రమైన తప్పిదాలు జరిగాయి. ఈ తప్పిదాల వల్ల ప్రాజెక్టు అభివృద్ధికి ఆటంకం కలిగింది. అప్పుడు జరిగిన తప్పిదాలను మేం ఇప్పుడు సరిచేస్తున్నాం.

రూ.2,020 కోట్ల నష్టం.. ఆ పత్రికలు ఎందుకు రాయలేదు?
డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల రూ.2,020 కోట్ల నష్టం వాటిల్లింది. ఇంత తీవ్రమైన నష్టం జరిగినపుడు ఆ పత్రికలు ఎందుకు రాయలేదు? టీడీపీ చేసిన తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. 2013, 14 రేట్లతోనే పోలవరం పూర్తి చేస్తామని 2016 లో చంద్రబాబు అగ్రిమెంట్ చేసుకున్నారు. 20398 కోట్లలో అంతా డ్రాచేసి 1,200 కోట్లు మిగిల్చారు. 1200 కోట్లతో పోలవరం పూర్తయిపోతుందా? మా ప్రభుత్వం వచ్చాక కొత్త రేట్లతో 55,546 కోట్లు అవుతుందని అంచనాలు కేంద్రానికి ఇచ్చాం.

Also Read..Perni Nani : టీజేపీగా‌ మారిన బీజేపీ.. వారి మాటలు వింటే ఒక్క సీటు కూడా గెలవరు : పేర్ని నాని

రూ.2,020 కోట్ల నష్టానికి కారణం ఎవరు?
41.15 మీటర్లకు ఎంత ఖర్చైతే అంత ఖర్చుతో పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం అంగీకరించింది. 12,911 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించింది. 12,911 కోట్లకు అదనంగా 5,127 కోట్లు విడుదల చేయాలని కోరాం. కేంద్రం అంగీకరించింది. మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమకు సిగ్గుందా? పత్రికల్లో ఫోటోల కోసం ఉమ చేసే చౌకబారు ఎత్తుగడ ఇది. పోలవరాన్ని సర్వనాశనం చేశారు. 2020 కోట్ల నష్టానికి కారణం ఎవరు? కాఫర్ డ్యామ్, స్పిల్ వే పూర్తి చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది.

Also Read..BJP Leaders : జేపీ నడ్డాను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు : బీజేపీ నేతలు

భారత్-పాకిస్తాన్ యుద్ధం స్థాయిలో చూపిస్తున్నారు:
గైడ్ బండ్ కుంగిందని.. పాకిస్థాన్-భారత్ యుద్ధం జరిగిన స్థాయిలో చూపిస్తున్నారు. గైడ్ బండ్ పెద్ద సమస్యే కాదు. పోలవరంలో టీడీపీ చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ మేం ముందుకు పోతున్నాం. చంద్రబాబుకు బుర్రపోయిందా? చంద్రబాబు ఏమైనా గొప్పోడా? కుప్పంను ఏ విధంగానూ అభివృద్ధి చేయని చంద్రబాబు మమ్మల్ని విమర్శిస్తారా? వైఎస్సార్ సీఎంగా పని చేసిన ఐదేళ్లలో పులివెందులను అద్భుతంగా అభివృద్ధి చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పంను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు.

సత్తెనపల్లి నుంచే పోటీ:
వైఎస్సార్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. అభివృద్ధి చేయడం చేతకాని వ్యక్తి చంద్రబాబు. పోలవరంపై చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. కచ్చితంగా పోలవరాన్ని జగన్ మోహన్ రెడ్డే పూర్తి చేస్తారు. బీజేపీ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. బీజేపీ పార్టీని బతికించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జనసేన విమర్శలు చేస్తే బీజేపీ చేసినట్లే. వాళ్ల దగ్గర అధారాలుంటే నిరూపించమనండి. కొత్త కొత్త వ్యక్తులను నాపై సత్తెనపల్లిలో పోటీకి తెస్తున్నారు. వేరువేరు పార్టీలు మారిన వస్తాదులంతా నాపై పోటీకొస్తున్నారు. జగన్ విశ్వాసం పొంది నేను సత్తెనపల్లిలో పోటీ చేస్తా” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.