Alla Nani : వాలంటీర్ వ్యవస్థను కూల దోయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు : ఆళ్ల నాని

పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడాడని పేర్కొన్నారు. పవన్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Alla Nani : వాలంటీర్ వ్యవస్థను కూల దోయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు : ఆళ్ల నాని

Alla Nani

Updated On : July 16, 2023 / 3:27 PM IST

Eluru Volunteers Honored : వాలంటీర్ వ్యవస్థను కూల దోయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు చెస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థను అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వాలంటీర్ల తల్లిదండ్రులు సైతం బాధ పడేలా నీచమైన మనస్తత్వంతో మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో వాలంటీర్లను సత్కరించిన ఆళ్ళ నాని వారి సేవలను కొనియాడారు.

మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లలకు ఏం సంబంధమని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పేదలకు పథకాలు వచ్చాయా లేదా అని తెలుసుకునే వారే వాలంటీర్లు అని పేర్కొన్నారు. కనీసం వార్డు మెంబర్ కూడా కానీ పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు చెప్పాయా అని ప్రశ్నించారు. వ్యక్తిగత వివరాలు యాప్ ద్వారా పంపుతున్నారని దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రజలను కేసులు పెట్టాలంటున్నాడని, ప్రజలు పవన్ కళ్యాణ్ ను విశ్వసించరని స్పష్టం చేశారు.

Jaggampeta YCP : జగ్గంపేట వైసీపీలో ముసలం.. తోట నరసింహం వర్సెస్ ఎమ్మెల్యే చంటిబాబు

పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడాడని పేర్కొన్నారు. మామిడి పళ్ళ బుట్టలో రెండు కుళ్ళి పోతే వాటిని తీసి బయట పడేస్తారు… బుట్ట మొత్తం పారేయరని పవన్ కళ్యాణ్ కు సూచించారు. పవన్ కళ్యాణ్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పవన్.. చంద్రబాబు లాగా గురువును మించిన శిష్యుడులా మారాడని పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కుట్రలు పన్నాలని చూస్తున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లాలని చూస్తున్నాడని విమర్శించారు. ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏలూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.129 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు.

Purandheswari : కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : పురంధేశ్వరి

ఇందులో 33శాతం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా,  67 శాతం రాష్ట్రం వాటా అని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారాలు చేయడం మనుకోవాలని హితవు పలికారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం కాక.. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. వాలంటీర్ల జోలికి వస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు.