ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందచేసింది. దాదాపు 1.389 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2018, డిసెంబర్ 31 సోమవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 169 గ్రూప్ 1, 446 గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు,లెక్చరర్, సీనియర్ ఎకౌంటెంట్ ,డిప్యూటీ తహసిల్దార్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు.గ్రూప్ 1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. గ్రూప్ 2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.మే 5న గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష, జులై 18, 19 తేదీల్లో గ్రూప్-2 మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు:
169 గ్రూప్ 1
446 గ్రూప్ 2
292 నాన్ ఎగ్జిక్యూటివ్
154 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
150 ఏఎస్‌వో పోస్టులు సాధారణ పరిపాలన శాఖలో
20 సీనియర్ అకౌంటెంట్లు
50 ఎస్‌ఐ పోస్టులు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్
40 ఎక్స్‌టెన్షన్ అధికారులు పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్
16 డిప్యూటీ తహశీల్దార్లు
13 సీనియర్ అకౌంటెంట్లు ట్రెజరీ డిపార్ట్ మెంట్
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు లెక్చరర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మత్స్యశాఖలో 43 పిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 308 లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిషరీస్ సబ్ సర్వీస్‌లో 10 అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8వరకు,
ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.