ఏపీలో కరోనా కట్టడికి కమిటీ..12 రైళ్లు రద్దు

ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి కన్వీనర్‌గా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని సీఎస్ నీలం సహాని వేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్ ఐసోలేటెడ్ చర్యలు చేపట్టామన్నారు.
ఇప్పటివరకు 7 వేల మంది తెలుగు వారు విదేశాల నుంచి ఏపీకి వచ్చారని వెల్లడించారు. విదేశాలనుండి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తరువాతే ఇళ్లకు పంపుతున్నామన్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.కర్నూలు జిల్లాలో ముగ్గురు యువకులు తీవ్ర జ్వరం, జలుబుతో ఆస్పత్రిలో చేరారు.
కెనడా, జర్మనీ నుంచి వచ్చిన ఇద్దరికి, ఇటలీ నుంచి వచ్చిన మరో యువకుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు వైద్యులు. ఇద్దరికి కరోనా లక్షణాలు లేవని నిర్దారించిన వైద్యులు.. మరొకరి శాంపిల్స్‌ను తిరుపతికి పంపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్-కలబురగి, కరీంనగర్-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాద్, ముంబై- నాగ్‌పూర్, ముంబై-అజ్ని ట్రైన్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
Read More : కరోనా భయం : తెలంగాణలో 5 కేసులు