ఏపీలో కరోనా : 133 రెడ్ జోన్లు…నెల్లూరులో 30..

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో 133 రెడ్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గరిష్టంగా నెల్లూరు జిల్లాలో 30 ప్రాంతాలు ఉండడం గమనార్హం.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను రెడ్ జోన్ల పరిధిలోకి తెచ్చారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను కంటెయిన్ క్లస్టరుగా పిలువనున్నారు. పట్టణాలు, నగరాల్లో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్ గా పిలుస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో 7 కి.మీటర్ల వరకు ఉండనుంది. ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందకుండా..ప్రకటించిన జోన్లలో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రకటించిన జోన్లలో ప్రవేశించే..బయటకు వెళ్లే మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. వాహనాల రాకపోకలు, ప్రజా రవాణాపై నిషేధం విధిస్తారు.
రెడ్ జోన్ల వివరాలు : నెల్లూరు 30. కర్నూలు 22. కృష్ణా 16. పశ్చిమ గోదావరి 12. గుంటూరు 12. ప్రకాశం 11. తూర్పుగోదావరి 8. చిత్తూరు 7. విశాఖపట్టణం 6. కడప 6. అనంతపురం 3
Also Read | కోవిడ్ -19 నుండి కిరాణ సామాన్లు, కరెన్సీ నోట్లను శుభ్రపరచడానికి పరికరాన్ని రూపొందించిన ఐఐటి